![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -295 లో... ఒకతనికి ప్రాజెక్ట్ గురించి ఐడియా ఇచ్చినందుకు సీతాకాంత్ కి అతను డబ్బులు ఇస్తాడు. తనకి అడ్వైజర్ గా ఉండమని అడుగగా సీతాకాంత్ సరే అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు ఇంటికి వెళ్ళాక ఎవరు ఎంత సంపాదించారో చూసుకుంటారు. నేను ఆటో రెంట్ పోగా వెయ్యి సంపాదించానని రామలక్ష్మి అంటుంది. నేను రెంట్ పోగా ఆరు వెయ్యలు సంపాదించానని సీతాకాంత్ అనగానే.. రామలక్ష్మి ఒక్క రోజులో అంత డబ్బా అని ఆశ్చర్యంగా చూస్తుంది.
నేను నీలాగా వెయ్యి సంపాదించాను కానీ ఒకతనికి ఐడియా ఇస్తే నాకూ డబ్బు ఇచ్చాడని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మి సీతాకాంత్ డబ్బులు గల్లాలో వేస్తుంది. ఏంటి అలా వేస్తున్నావని సీతాకాంత్ అడుగగా.. ఇద్దరు సంపాదిస్తుంటే ఒకరివి ఇలా సేవ్ చెయ్యాలి.. ఫ్యూచర్ లో ఎవరిని అడగాల్సిన పని ఉండదని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు కబుర్లు చెప్పుకుంటూ.. ఒకరికొకరు భోజనం తినిపించుకుంటారు. మరుసటి రోజు ఉదయం మనం మొదలు పెట్టబోయే రియల్ ఎస్టేట్ వెంచర్ ఇదే అని శ్రీలత వాళ్లకి చూపిస్తాడు భద్రం. సీతాకాంత్ వెంచర్ అని పెడితే సీతాకాంత్ పై నమ్మకంతో అందరు కొంటారు.. ఆఫర్స్ పెట్టి అమ్మాలి.. మేమే కట్టిస్తామని చెప్పాలని భద్రం అనగానే.. మరి మనకేం లాభమని సందీప్ అంటాడు. ఇందులో లాభం చాలా ఉంటుంది. ఒక ఫైవ్ పర్సెంట్ లాభం ఇవ్వండి. మిగతావి మొత్తం మీదే అనగానే శ్రీలత వాళ్లు హ్యాపీగా ఫీల్ అవుతారు. లాభమని ఆనందపడుతున్నారు తర్వాత జరగబోయే నష్టం తెలిస్తే అని భద్రం తనలో తాను అనుకుంటాడు.
ఆ తర్వాత శ్రీవల్లి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. పక్కన శ్రీలత ఉంటుంది. మెల్లగా వెళ్ళమని చెప్తూ శ్రీలత భయపడతుంది. అప్పుడే ఎదురుగా వస్తున్న రామలక్ష్మి ఆటోకి డాష్ ఇస్తుంది శ్రీవల్లి. కళ్ళు నెత్తికెక్కినాయా అని శ్రీలత వాళ్ళపై రామలక్ష్మి కోప్పడుతుంది. శ్రీలత పొగరుగా మాట్లాడతుంది. దాంతో రామలక్ష్మి అందరిని పిలిచి ఇలా డాష్ ఇచ్చారు. పైగా తిడుతున్నారని చెప్తుంది. అందరు శ్రీలత వాళ్ళని తిడతారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తానని రామలక్ష్మి అనగానే.. ఏం చెయ్యాలి అక్కా అని శ్రీవల్లి రిక్వెస్ట్ చేస్తుంది. సారీ చెప్పాలని రామలక్ష్మి అనగానే శ్రీవల్లి సారీ చెప్తుంది. నువ్వు కాదు ఆవిడ అనగానే.. నేను చెప్పనంటుంది శ్రీలత. దాంతో శ్రీవల్లి రిక్వెస్ట్ చెయ్యడంతో రామలక్ష్మికి సారీ చెప్తుంది శ్రీలత. త్వరలోనే సీతాకాంత్ సర్ కి కూడా చెప్పిపిస్తానని శ్రీలతతో రామలక్ష్మి ఛాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |